breaking news
Rajkot Airport
-
వర్షాలకు కూలిన రాజ్‌కోట్ ఎయిర్పోర్ట్ పైకప్పు
రాజ్‌కోట్: ఢిల్లీ, జబల్పూర్లను అతలాకుతలం చేసిన వర్షాలు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోనూ బీభత్సం సృష్టించాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ టరి్మనల్ కూలిన మరుసటి రోజే మరో ఎయిర్పోర్ట్ వర్షాల బారిన పడింది. రాజ్‌కోట్‌లో అక్కడి భారీ వర్షాలకు సోమవారం ఉదయం రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల పికప్, డ్రాప్ ఏరియాపై నిర్మించిన భారీ టెంట్ కూలింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే టెంట్ కూలిన ఘటనపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ‘‘ ప్రధాని మోదీ స్వయంగా వచ్చి ఈ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించారు. 11 నెలలకే పైకప్పు కూలింది. అవినీతి ఏ స్థాయిలో ఉందో కూలిన ఘటన చాటిచెప్తోంది. ఢిల్లీ మాదిరి ఘటన వేళ అక్కడ ఎవరైనా ఉంటే జరిగే ప్రాణనష్టానికి ఎవరు బాధ్యులు?. తరచూ అవినీతిపై ప్రసంగాలు దంచే ప్రధాని అవినీతిరహిత పాలనపైనా దృష్టిసారించాలి’ అని గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షులు శక్తిసిన్హ్ గోహిల్ అన్నారు. నెహ్రూను నిందించొద్దు: వ్యంగ్యంగా స్పందించిన బీజేపీ రాజ్‌కోట్ ఘటనపై బీజేపీ వెటకారంగా స్పందించింది. ‘‘ నిన్నటి ఢిల్లీ ఎయిర్పోర్ట్ టర్మినల్ కూటిన ఘటనతో రాజ్‌కోట్ ఘటనను పోల్చొద్దు. రాజ్‌కోట్‌లో పెనుగాలులకు టెంట్ వస్త్రం చిరిగి అది పీలికలై పడిపోయింది. తక్కువ ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించారని మీరు జవహర్లాల్ నెహ్రూను నిందిస్తారేమో. అలా చేయకండి. ఎందుకంటే ఆయన ఇన్ని విమానాశ్రయాలు నిర్మించలేరు. ఆయనకే మనం అవకాశం ఇచ్చి ఉంటే ఇప్పటికీ మనం రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) అనుమతితో ఎడ్లబళ్లపై ప్రయాణాలు చేస్తూ ఉండేవాళ్లం’ అని బీజేపీ ఐటీ విభాగ సారథి అమిత్ మాలవీయ ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. -
కూలిన మరో ఎయిర్పోర్ట్ టెర్మినల్ రూఫ్.. మూడు రోజుల్లో రెండో ఘటన
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో టెర్మినల్ రూఫ్ ఘటనను మరిచిపోకముందే గుజరాత్‌లోని రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌లనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది.భారీ వర్షం కారణంగా రాజ్‌కోట్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ వెలువల ఉన్న పైకప్పు శనివారం కుప్ప కూలిపోయింది. ప్రయాణికుల పికప్, డ్రాప్ పాయింట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.VIDEO | Canopy collapses at the passenger pickup and drop area outside #Rajkot airport terminal amid heavy rains. (Source: Third Party) pic.twitter.com/gsurfX2O1S— Press Trust of India (@PTI_News) June 29, 2024 కాగా శుక్రవారం ఉదయం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 1 వద్ద పైకప్పు కూలిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా ఆరుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దుమ్నా ఎయిర్‌పోర్టులో భారీ వర్షాల కారణంగా టెర్మినల్ రూప్ పడిపోయింది. కాగా గుజరాత్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికలు జారీ చేసిందిశనివారం దక్షిణ గుజరాత్‌కు 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరో ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. -
గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు మోదీ శంకుస్ధాపన