నిజ్జర్‌కు కెనడా పార్లమెంటు నివాళి | Canadian parliament moment of silence for terrorist Nijjar | Sakshi
Sakshi News home page

నిజ్జర్‌కు కెనడా పార్లమెంటు నివాళి

Published Thu, Jun 20 2024 5:44 AM | Last Updated on Thu, Jun 20 2024 5:44 AM

Canadian parliament moment of silence for terrorist Nijjar

న్యూఢిల్లీ: ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ మృతి చెంది ఏడాది గడిచిన సందర్భంగా మంగళవారం కెనడా పార్లమెంటు నివాళులరి్పంచింది. హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో సభ్యులు మౌనం పాటించారు. ఖలిస్తానీ టైగర్‌ ఫోర్స్‌ (కేటీఎఫ్‌) అధినేత నిజ్జర్‌ గత ఏడాది జూన్‌ 18న కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా గురుద్వారా ఎదుట జరిగిన కాల్పుల్లో హతమాయ్యాడు. 

భారత ప్రభుత్వం ప్రకటించిన టెర్రిరిస్టుల జాబితాలో నిజ్జర్‌ పేరు ఉంది. నలుగురు భారతీయులు నిజ్జర్‌ హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. నిజ్జర్‌ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని కెనడా ఆరోపిస్తోంది. అప్పటినుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 1997లో నకిలీ పాస్‌పోర్ట్‌పై నిజ్జర్‌ కెనడాకు వెళ్లాడు. శరణార్థిగా కెనడా పౌరసత్వాన్ని కోరాడు. ఇది తిరస్కరణకు గురైంది. 

అనంతరం తాను కెనడాకు రావడానికి సహాయపడ్డ మహిళను నిజ్జర్‌ వివాహమాడి మరోమారు పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోగా.. మళ్లీ తిరస్కరణకు గురైంది. అయితే నిజ్జర్‌ హత్యకు గురైన వెంటనే కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడెయూ అతను కెనడా పౌరుడని పార్లమెంటులో చెప్పారు. నిజ్జర్‌ కేటీఎఫ్‌ కోసం నియామకాలు చేసుకొని.. వారికి శిక్షణ ఇస్తున్నాడని భారత భద్రతా సంస్థలు పేర్కొన్నాయి.

 నిజ్జర్‌కు కెనడా పార్లమెంటు నివాళి అరి్పంచడంపై వాంకోవర్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. 1985లో ఎయిర్‌ ఇండియా కనిష్క విమానంలో ఖలిస్తానీ తీవ్రవాదులు బాంబులు అమర్చడంతో 329 ప్రాణాలు కోల్పోయారు. వారి స్మృత్యర్థం ఈనెల 23న (విమాన ఘటన 39 ఏళ్లు) సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement