రాజస్థాన్‌లో హై అలర్ట్‌.. రైల్వేస్టేషన్‌లకు బాంబు బెదిరింపులు | Bomb Threats To Railway Stations In Rajasthan | Sakshi
Sakshi News home page

రాజస్థాన్‌లో హై అలర్ట్‌.. రైల్వేస్టేషన్‌లకు బాంబు బెదిరింపులు

Oct 2 2024 12:24 PM | Updated on Oct 2 2024 12:59 PM

Bomb Threats To Railway Stations In Rajasthan

జైపూర్‌: దేశంలో రోజూ ఎక్కడో ఓ చోట బాంబు బెదిరింపు వస్తూనే ఉంది. స్కూళ్లు, ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్‌లు, ఆస్పత్రులు ఇలా దేన్నీ వదలకుండా ఫోన్‌లు, మెయిళ్లు, లేఖల ద్వారా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌లోని పలు రైల్వేస్టేషన్‌లకు బుధవారం(అక్టోబర్‌2) బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు నిర్వహించారు.

రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్‌ జంక్షన్‌లోని స్టేషన్‌ సూపరింటెండెంట్‌కు గుర్తుతెలియని నుంచి ఓ లేఖ వచ్చింది. లేఖ జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ పేరుతో ఉంది. బికనీర్‌, శ్రీరంగానగర్‌, జోధ్‌పుర్‌, బుందీ, కోట, జైపూర్‌, ఉదయర్‌పుర్‌ సహా పలు  రైల్వేస్టేషన్‌లలో బాంబు దాడులు జరగనున్నాయనేది లేఖ సారాంశం.

లేఖ చదవిన వెంటనే అధికారులు అలర్ట్‌ అయ్యారు. బీఎస్‌ఎఫ్‌, జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ బలగాలు రైల్వేస్టేషన్‌లను జల్లెడ పట్టాయి. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: పుణెలో కూలిన హెలికాప్టర్‌.. ముగ్గురు మృతి 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement