వడోదరలో పడవ బోల్తా.. 13 మంది విద్యార్థులు మృతి

Boat Overturn In Gujarat Vadodara School Children Died - Sakshi

వడోదర: గుజరాత్‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. వడోదర శివార్లలోని హర్ని సరస్సులో విహార యాత్రకు వెళ్లిన స్కూల్‌ విద్యార్థుల పడవ తిరిగి వస్తుండగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పదమూడు మంది విద్యార్థులు చనిపోయారు. ప్రమాదం జరిగినపుడు పడవలో మొత్తం 27 మంది విద్యార్థులున్నారు.

సరస్సులో పడిపోయిన మిగిలిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు గల్లంతయిన విద్యార్థుల కోసం గాలిస్తున్నట్లు గుజరాత్‌ విద్యాశాఖ మంత్రి కుబేర్‌ దిండోర్‌ చెప్పారు. పడవ ఓవర్‌లోడ్‌ అవడం, పిల్లలెవరూ లైఫ్‌ జాకెట్లు ధరించకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని జిల్లా కలెక్టర్‌ ఏబీ గోర్‌ తెలిపారు.  

   

ఇదీచదవండి.. భారత స్పేస్‌ స్టేషన్‌.. ఇస్రో చైర్మన్‌ కీలక ప్రకటన

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top