BJP Sunil Bansal Key Comments On Munugode Bypoll - Sakshi
Sakshi News home page

‘వచ్చే నెలలోనే మునుగోడు ఉప ఎన్నిక.. ఇన్‌ఛార్జ్‌లు రెడీగా ఉండండి’

Oct 1 2022 5:51 PM | Updated on Oct 1 2022 6:28 PM

BJP Sunil Bansal Key Comments On Munugode Bypoll - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పాలిటిక్స్‌లో మునుగోడు ఉప ఎన్నిక వేడి ఇంకా కొనసాగుతోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఇక, ఉప ఎన్నికల షెడ్యూల్‌పైనే సస్పెన్స్‌ కొనసాగుతోంది. 

ఈ నేపథ్యంలో బీజేపీ నేత సునీల్‌ బన్సల్‌.. మునుగోడు ఉప ఎన్నికపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, శనివారం సునీల్‌ బన్సల్‌.. మునుగోడు బీజేపీ ఇన్‌చార్జ్‌లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సునీల్‌ బన్సల్‌.. పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. బన్సల్‌ మాట్లాడుతూ.. ‘మునుగోడు ఎన్నికను సీరియస్‌గా తీసుకోవాలి. నవంబర్‌ మొదటి లేదా రెండో వారంలో ఉప ఎన్నిక  ఉంటుంది. మునుగోడులో బీజేపీ గెలుస్తుంది. ఇన్‌ఛార్జ్‌లు మునుగోడులోనే ఉండాలి’ అని తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement