రెండు డోసులు తీసుకుంటే అనుమతించండి

BJP Leader Pravin Darekar Allow To Entry In Local Trains - Sakshi

లోకల్‌ రైళ్లలో ప్రవేశంపై బీజేపీ నేత ప్రవీణ్‌ దరేకర్‌ 

సీఎం ఉద్ధవ్, రైల్వే సహాయ మంత్రి రావ్‌సాహెబ్‌ దానవేలకు లేఖ

సాక్షి, ముంబై: రెండు డోసులు కరోనా టీకా తీసుకున్న సామాన్య ప్రజలకు లోకల్‌ రైళ్లల్లో ప్రయాణించేందుకు అనుమతి కలి్పంచాలని బీజేపీ నాయకు డు ప్రవీణ్‌ దరేకర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే, కేంద్ర రైల్వే సహాయ మంత్రి రావ్‌సాహెబ్‌ దానవేలకు లేఖ రాశారు. దీంతో కరోనా టీకాలు రెండు డోసులు తీసుకునేవారికి ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తారన్న సామాన్య ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రయాణికుల సంఘం రెండు డోసులు టీ కాలు తీసుకున్నవారిని అనుమతించాలని డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

దీనిపై బీఎంసీ సైతం సమాలోచనలు జరుపుతోం ది. ఇప్పుడు బీజేపీ నేత ప్రవీణ్‌ దరేకర్‌ కూడా ఈ విషయంపై స్పందించడం తో ప్రయాణికుల్లో ఆశలు చిగురించాయి. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కళ్యాణ్‌తోపాటు ఇతర పరిసరాల నుంచి ముంబైకి వచ్చే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గంటలో చేరుకునే ప్రయాణం రోడ్డు మార్గం ద్వారా నాలుగైదు గంటలు పడుతోంది. దీంతో ప్రయాణికులకు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. వీటన్నింటికీ ముఖ్యమంత్రితోపాటు రావ్‌సాహెబ్‌ దానవేల దృష్టికి తీసుకవెళ్లాం’’ అని తెలిపారు. అదేవిధంగా కర్జత్, కసా రాల నుంచి సీఎస్‌ఎంటీ, డాహాణూ నుంచి చర్చి గేట్, పన్వేల్‌ నుంచి సీఎస్‌ఎంటీల మధ్య సామన్యులను అనుమతించాలని కోరుతూ వినతి పత్రాలను కూడా అందించినట్లు ప్రవీణ్‌ తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top