రాబిన్‌ హుడ్‌ అవతారమెత్తిన డీజీపీ 

Bihar DGP In Robin Hood Avatar - Sakshi

పాట్నా: వాలంటరీ రిటైర్‌మెంట్‌ ప్రకటించి రాబిన్‌హుడ్‌ అవతారమెత్తారు బిహార్‌ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే. అయితే అది నిజంగా కాదు ఓ వీడియో సాంగ్‌లో. మంగళవారం వీఆర్‌ఎస్‌ ప్రకటించిన ఆయన.. బుధవారం ‘రాబిన్‌ హుడ్‌ బీహార్‌ కే’ అనే ఓ మ్యూజిక్‌ వీడియోతో నెట్టింటిలో తన సైలెంట్‌ మ్యానరిజంతో హల్‌చల్‌ చేస్తున్నారు. యూట్యూబ్‌లో విడుదలైన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. బిగ్‌బాస్‌ ఫేమ్‌, సింగర్‌ దీపర్‌ ఠాకూర్‌ ఈ పాటను పాడటమే కాకుండా, వీడియోలో కనిపించి డీజీపీని పొగడ్తలతో ముంచెత్తారు. (రియాకు అర్హత లేదు.. డీజీపీ రాజీనామా)

కాగా, బిహార్‌ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే 2009 లోక్‌ సభ ఎన్నికల సమయంలో వీఆర్‌ఎస్‌ తీసుకోవాలనుకోగా, ఆయన దరఖాస్తు తిరస్కరణకు గురైంది. దీంతో ఆయన విధులకు మళ్లీ హాజరు కావాల్సి వచ్చింది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి రియా చక్రవర్తిపై వ్యాఖ్యలు చేసి గుప్తేశ్వర్‌ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top