Bharat Jodo Yatra: అత్యంత అవినీతి ప్రభుత్వం | Bharat Jodo Yatra: Karnataka govt country in most corrupt says Rahul Gandhi | Sakshi
Sakshi News home page

Bharat Jodo Yatra: అత్యంత అవినీతి ప్రభుత్వం

Oct 4 2022 4:55 AM | Updated on Oct 4 2022 4:55 AM

Bharat Jodo Yatra: Karnataka govt country in most corrupt says Rahul Gandhi - Sakshi

పాదయాత్రలో వృద్ధురాలితో రాహుల్‌

మైసూరు: దేశంలో అత్యంత అవినీతిమయ ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది కర్ణాటకలో బీజేపీ సర్కారే అని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఆరోపించారు. పదిరోజుల దసరా సంబరాల్లో మునిగిపోయిన మైసూరు పట్టణానికి భారత్‌ జోడో యాత్ర చేరుకున్న సందర్భంగా సోమవారం అక్కడ రాహుల్‌ మాట్లాడారు.

‘40 శాతం ముడుపులకు అలవాటుపడ్డ కర్ణాటక బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని వేధిస్తోంది. ముఖ్యంగా రైతులు, కార్మికులు, చిరు వ్యాపారుల వ్యథలకు అంతేలేదు. ఈ కమీషన్ల పరంపరపై ప్రధానికి గతంలోనే రాష్ట్ర కాంట్రాక్టర్లు ఫిర్యాదుచేశారు. అయినా మోదీ చర్యలు శూన్యం’ అని రాహుల్‌ అన్నారు. మరోవైపు రాహుల్‌ సోమవారం మైసూరు చాముండి కొండపై చాముండేశ్వరి దేవీ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా, గురువారం యాత్రలో పాల్గొనేందుకు సోనియా మైసూరు చేరుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement