భగత్ సింగ్ అపూర్వమైన దేశభక్తుడు- కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే

Bhagat Singh Was An Unparalleled Patriot By Union Minister Ashwini Kumar Choubey - Sakshi

న్యూఢిల్లీ:  షహీద్  భగత్ సింగ్ ఒక అపూర్వమైన దేశ భక్తుడని, ఆయన అందరివాడని, రాబోయే తరాలవారికి ఒక స్ఫూర్తి జ్యోతి అని కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే భగత్ సింగ్ సేవలను కొనియాడారు.  భగత్ సింగ్ 116వ జయంతి సందర్భంగా రాజ్ త్రిపాఠీ, రాహుల్ ఇంక్విలాబ్ రచించిన " క్రాంతీ కి దరోహర్" (హిందీ) గ్రంధాన్ని ముఖ్య అతిధి   కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే అంబేద్కర్ ఆడిటోరియం, ఆంధ్ర భవన్ , ఢిల్లీలో 28 సెప్టెంబర్ 2023 న సాయంత్రం 5 గంటలకు జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు.

సభకు ముమ్మారు గిన్నీస్ ప్రపంచ రికార్డుల సృష్టికర్త, సేవ్ టెంపుల్స్ భారత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ సభకు అధ్యక్షత వహించారు. గౌరవ అతిథిగా విచ్చెసిన శాంభవి మఠాధిపతి స్వామి  ఆనంద్ స్వరూప్ మహారాజ్  మాట్లాడుతూ పటిష్ట భారత దేశం కోసం, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ కృషి  చేయాలని పిలిపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంగళ్ పాండే, భగత్ సింగ్ కుటుంబ సభ్యులతో పాటు ఎంతోమంది స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబాల వారు పాల్గొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top