‘రామాలయం’ చీరలకు భలే డిమాండ్‌! | Sakshi
Sakshi News home page

Ram Mandir: ‘రామాలయం’ చీరలకు భలే డిమాండ్‌!

Published Tue, Jan 9 2024 8:12 AM

Banarasi Saree Weavers Receiving Orders for Ram Mandir Themed Sarees - Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఈ నెలలో జరగనున్న శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇటువంటి తరుణంలో రామాలయం థీమ్‌తో రూపొందుతున్న బనారసీ చీరలకు భలే డిమాండ్‌ ఏర్పడింది.

హిందూ మహిళలు, ముఖ్యంగా రామభక్తులైన మహిళలు రామాలయం థీమ్‌తో కూడిన చీరలను కట్టుకోవాలని ముచ్చట పడుతున్నారు. దీంతో యూపీలోని నేత కార్మికులు చీరల పల్లూలపై రామాలయం రామ మందిర నమూనా, రాముడి జీవితానికి సంబంధించిన పలు ఘట్టాలతో కూడిన డిజైన్లను తీర్చిదిద్దుతున్నారు.  

వారణాసిలోని ముబారక్‌పూర్ ప్రాంతానికి చెందిన చేనేత కార్మికుడు అనిసూర్ రెహమాన్ మాట్లాడుతూ, అయోధ్యలో నూతన రామాలయ ప్రారంభోత్సవంపై వారణాసిలోని చేనేత సంఘంలో  ఎనలేని ఉత్సాహం నెలకొన్నదని అన్నారు. చారిత్రక విశేషాలతో రూపొందించిన చీరలకు ఎప్పటి నుంచో విపరీతమైన డిమాండ్ ఉందని, ఇప్పుడు రామ మందిరం థీమ్‌తో కూడిన చీరలకు మంచి డిమాండ్‌ ఏర్పడిందన్నారు. రామాలయం థీమ్‌తో రూపొందించిన చీరలు కట్టుకుని, తమ ప్రాంతాల్లో ఈ నెల 22న జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటామని పలువురు మహిళలు చెబుతున్నారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement