నేడు నింగిలోకి యాక్సియం–4 | Axiom-4 launch tentatively set for June 25 | Sakshi
Sakshi News home page

నేడు నింగిలోకి యాక్సియం–4

Jun 25 2025 2:38 AM | Updated on Jun 25 2025 2:38 AM

Axiom-4 launch tentatively set for June 25

న్యూఢిల్లీ: భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా తదితర వ్యోమగాములతో కూడిన యాక్సియం–4 ప్రైవేట్‌ మిషన్‌ ప్రయోగం నేడు చేపట్టనున్నట్లు నాసా తెలిపింది. స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా బుధవారం మధ్యాహ్నం 12 గంటల కు ఈ ప్రయోగం చేపట్టనున్నారు.

పెగ్గీ వాట్సన్‌ క మాండర్‌గా వ్యవహరించే మిషన్‌లో శుక్లా పైలట్‌గా ఉంటారు. వాస్తవానికి ఈ మిషన్‌ ప్రయో గం మే 29వ తేదీనే చేపట్టాల్సి ఉంది. సాంకేతిక కారణాలు, అననుకూల వాతావరణ పరిస్థి తుల నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement