
దిస్పూర్: విధి నిర్వహణలో నిజాయితీ ఓ ప్రభుత్వ ఉద్యోగిని ప్రాణం తీసింది. ప్రాజెక్ట్‌లు పూర్తి కానప్పటికీ.. పూర్తయ్యాయని బిల్లులు ఇవ్వాలంటూ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD)లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న బాధితురాల్ని ఆమె సీనియర్ ఉద్యోగులు వేధించారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాల్ని వివరిస్తూ ఓ లేఖను రాసింది. ఆ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నా పని ఒత్తిడి కారణంగా నేను ఈ చర్య తీసుకుంటున్నాను. ఆఫీసులో నాకు అండగా ఎవరూ లేరు. పూర్తిగా అలసిపోయాను నా తల్లిదండ్రులు నా గురించి ఆందోళన చెందుతున్నారు’అని సూసైడ్ నోట్‌లో రాశారు.
బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సూసైడ్ నోట్ ఆధారంగా, ఇటీవల పదోన్నతి పొందిన సూపరింటెండెంట్ ఇంజనీర్, గతంలో బొంగైగావ్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేసిన దినేష్ మేధి శర్మ, ప్రస్తుతం బొంగైగావ్‌లో పనిచేస్తున్న సబ్-డివిజనల్ ఆఫీసర్ (ఎస్‌డిఓ) అమీనుల్ ఇస్లాంలను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సైతం దర్యాప్తు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.