వైఎస్‌ జగన్‌: అమిత్ షాతో రెండోసారి సీఎం భేటీ | YS Jagan Meets Union Minister Amit Shah for 2nd Time to Discuss AP State Develipment Issues - Sakshi
Sakshi News home page

అమిత్ షాతో రెండోసారి సీఎం జగన్ భేటీ 

Sep 23 2020 10:35 AM | Updated on Sep 23 2020 1:19 PM

AP CM YS Jagan Mohan Reddy meets Again Union Home Minister Amit Shah - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి సమావేశం అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాగా ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం సాయంత్రం గంటపాటు అమిత్‌ షాతో భేటీ అయిన విషయం తెలిసిందే. కాగా అంతకు ముందు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు వెచ్చించిన రూ.4 వేల కోట్ల మేర రీయింబర్స్‌ చేయాలని, పునరావాస సాయం త్వరితగతిన అందించాలని ఈ సందర్భంగా సీఎం జగన్‌ కోరారు. (కేంద్రమంత్రి షెకావత్‌తో సీఎం జగన్‌ భేటీ)

Advertisement
 
Advertisement
Advertisement