రాహుల్ గాంధీ పాదయాత్రలో నటి స్వర భాస్కర్ | Sakshi
Sakshi News home page

రాహుల్ గాంధీ పాదయాత్రలో నటి స్వర భాస్కర్

Published Sun, Mar 17 2024 2:26 PM

Actor Swara Bhasker Joins Rahul Gandhi Nyay Sankalp Padyatra - Sakshi

నటి స్వర భాస్కర్ ఆదివారం ఉదయం ముంబైలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని 'జన్ న్యాయ్ పాదయాత్ర'లో చేరారు. కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసిన వీడియోలో.. స్వర భాస్కర్, రాహుల్ గాంధీతో పాటు నడుస్తూ కనిపించారు. ఇందులో ఆయన ప్రియాంక గాంధీ, మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ కూడా ఉండటం చూడవచ్చు.

జన్ న్యాయ్ పాదయాత్ర అనంతరం స్వర భాస్కర్ విలేకరులతో మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్ర అనే రెండు యాత్రలను ప్రశంసించారు. దేశం గత 10 సంవత్సరాలుగా ద్వేషం అనే మహమ్మారితో బాధపడుతోంది. ఈ యాత్ర వల్ల ప్రేమ ఏర్పడుతుందని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ నేతృత్వంలోని రెండు భారత్ జోడో యాత్రలు ప్రశంసనీయం. దేశంలో ప్రజలు రాహుల్ గాంధీని కలుసుకోవాలని.. వారితో మమేకం కావాలని కోరుకుంటున్నారని స్వర భాస్కర్ అన్నారు. ఈమె డిసెంబర్ 2022లో కూడా భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement