లోయలో పడిన ఆర్మీ వాహనం.. 9 మంది జవాన్లు మృతి | 9 Indian army soldiers died in road accident | Sakshi
Sakshi News home page

లోయలో పడిన ఆర్మీ వాహనం.. 9 మంది జవాన్లు మృతి

Aug 19 2023 9:52 PM | Updated on Aug 19 2023 10:06 PM

9 Indian army soldiers died in road accident - Sakshi

లడఖ్‌ ఖేరి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది ఇండియన్ ఆర్మీ జవాన్లు మృతిచెందారు. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఇందులో ఎనిమిది మంది జవాన్లు కాగా, ఒకరు జేసీవో (జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్) ఉన్నారు.

లేహ్ ప్రాంతానికి సుమారు 150కిమీ దూరంలో ఉన్న ఖేరీలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇండియన్ ఆర్మీ జవాన్లు మరణించడంతో యావత్ భారతదేశం ఒక్క సారిగా దిగ్బ్రాంతికి గురైంది.

Advertisement
 
Advertisement
Advertisement