పట్టాలు తప్పిన గూడ్స్ రైలు | 2 Coaches Of Goods Train Derail In Maharashtra | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు-11 రైళ్ల దారి మళ్లింపు

Dec 10 2023 9:47 PM | Updated on Dec 10 2023 9:54 PM

2 Coaches Of Goods Train Derail In Maharashtra - Sakshi

కసర రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.

ముంబయి: మహారాష్ట్రలోని కసర రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయని సెంట్రల్ రైల్వే తెలిపింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో 11 ఎక్స్‌ప్రెస్ రైళ్లను దారి మళ్లించారు. మరో నాలుగు ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలపై ప్రభావం పడినట్లు అధికారులు తెలిపారు.

రైలు పట్టాలు తప్పినప్పటికీ ముంబయి సబర్బన్ రైలు సేవలు ప్రభావితం కాలేదని సెంట్రల్ రైల్వే తెలిపింది. కళ్యాణ్- ఇగత్‌పురి నుండి అధికారులు రెండు సహాయ రైళ్లను సంఘటనా స్థలానికి పంపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇదీ చదవండి: కూతుర్ని చంపి రీసార్ట్‌లో దంపతులు ఆత్మహత్య

Advertisement
 
Advertisement
Advertisement