నారాయణపేట ఎడ్యుకేషన్: తెలంగాణ రాష్ట్ర స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఆదేశాల మేరకు సోమవారం జిల్లాకేంద్రంలోని మినీ స్టేడియంలో ఎస్జీఎఫ్ జిల్లాస్థాయి అండర్–14, 17 బాల బాలికల చెస్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు ఉమ్మడి జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని.. ఆసక్తి, అర్హతగల క్రీడాకారులు బోనాఫైడ్, ఆధార్‌కార్డ్, పదోతరగతి మెమోతో ఉదయం 9 వరకు స్టేడియంలో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు.
పీడీ పోస్టుకు
దరఖాస్తుల ఆహ్వానం
ధన్వాడ: స్థానిక తెలంగాణ మోడల్ పాఠశాలలో కాంట్రాక్టు పద్ధతిన పీడీగా పనిచేసేందుకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ వైశాలి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏదైనా డిగ్రీతో పాటు బీపీఈడీ పూర్తి చేసినవారు అర్హులని.. ఈ నెల 27న పాఠశాలలో ఇంటర్వ్యూ ఉంటుందని అన్ని ధ్రువపత్రాలతో ఉదయం 11 గంటల వరకు హాజరుకావాలని పేర్కొన్నారు.
12వ రోజుకు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె
నారాయణపేట: ఏళ్లుగా ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న జాతీయ ఆరోగ్య మిషనన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే క్రమబద్దీకరించాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో టీజీ ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు శనివారం 12వ రోజుకు చేరాయి. జిల్లా, పట్టణ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు మనోహర్ ప్రసాద్‌గౌడ్, ప్రధానకార్యదర్శి వామనగేరి సంతోష్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారుతున్నా ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల జీవితాల్లో ఆశించిన మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్లుగా సేవలందిస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు క్రమబద్ధీకరించాలని కోరారు. మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సంఘీభావం తెలిపిన వారిలో సంఘం జిల్లా కోశాధికారి తమ్మలి సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు భరత్, సత్యనారాయణ, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.


