‘పీఎం రాహత్‌’ పకడ్బందీగా అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘పీఎం రాహత్‌’ పకడ్బందీగా అమలు చేయాలి

Oct 25 2026 1:11 AM | Updated on Oct 25 2026 1:11 AM

నారాయణపేట: రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెనన్‌ అవర్‌లోనే అత్యవసర వైద్యం అందించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీను సూచించారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంజయ్‌ జాజు హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా.. జిల్లా నుంచి అదనపు కలెక్టర్‌ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ప్రతి కేసును ఈ–డీఏఆర్‌ పోర్టల్‌లో నమోదుచేసి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని స్పష్టం చేశారు. ఆస్పత్రులు టీఎంఎస్‌ 2.0 పోర్టల్‌లో కేసుల వివరాలను నమోదు చేయాలని సూచించారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లోపు నమోదైన కేసులకు సంబంధించి ఆస్పత్రుల నుంచి వచ్చే ధ్రువీకరణ అభ్యర్థనలను పోలీసులు పరిశీలించి ఆమోదించాలని తెలిపారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో ప్రమాద కేసుల నమోదు, ధ్రువీకరణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి మ్యాపింగ్‌ చేయాలని.. నివారణకు అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశాల్లో ప్రమాదాల వివరాలు, బాధితులకు అందుతున్న వైద్యసేవలు, పెండింగ్‌ కేసులు, క్లెయిమ్‌లు, ఆస్పత్రులకు నిధుల చెల్లింపులపై సమీక్షించాలని సూచించారు. పోలీసు, వైద్య, రవాణా, రహదారులు, భవనాల శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. పథకంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నెక్స్‌ట్‌జెనన్‌ ఎం పరివాహన్‌న మొబైల్‌ యాప్‌ వినియోగాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. జిల్లాలో పీఎం రాహత్‌ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని.. ప్రతి ఆరోగ్యశ్రీ ఆస్పత్రి నమోదు ప్రక్రియను వెంటనే పూర్తి చేయించాలని, వివరాలను సంబంధిత పోలీస్‌స్టేషనన్‌ ఎస్‌హెచ్‌ఓల వివరాలతో మ్యాపింగ్‌ చేయాలని సూచించారు. ప్రమాదం జరిగిన వెంటనే కేసు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి ధ్రువీకరణలు, ఆమోదాలు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా పర్యవేక్షించాలని తెలిపారు. జిల్లా ఆరోగ్యశ్రీ మేనేజర్‌, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సమన్వయంతో పనిచేస్తూ ఆస్పత్రుల నమోదు, కేసుల ఆన్‌లైన్‌ నమోదు, పెండింగ్‌ ఆమోదాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. పరిపాలన ప్రక్రియల కారణంగా అత్యవసర చికిత్సలో జాప్యం జరగకూడదని, అర్హులైన ప్రతి ప్రమాద బాధితుడికి పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్‌న్స్‌లో ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకటరమణ, జిల్లా రవాణాశాఖ అధికారి ఆనంద్‌, ఈ–డీఏఆర్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌గౌడ్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement