నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి

Oct 25 2026 1:11 AM | Updated on Oct 25 2026 1:11 AM

నారాయణపేట ఎడ్యుకేషన్‌: విద్య అనేది కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతను పెంపొందించాలని జిల్లా విద్యాధికారి డా. గోవిందరాజు అన్నారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష సంయుక్తంగా జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులకు మాక్‌ పార్లమెంట్‌, స్పెల్‌ బి, క్విజ్‌ పోటీలను శనివారం జాజాపూర్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడారు. విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడం, నాయకత్వ లక్షణాలు, భాషా నైపుణ్యాలు, తార్కిక ఆలోచన సామర్థ్యం, సాధారణ జ్ఞానం, ఆత్మ విశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా పోటీలు నిర్వహించినట్లు వివరించారు. ఇలాంటి పోటీలు విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించేందుకు మంచి అవకాశమని.. పోటీతత్వాన్ని ఆరోగ్యకరంగా స్వీకరించడం, ఇతరుల అభిప్రాయలను గౌరవించడం, క్రమశిక్షణతో వ్యవహరించడం గెలుపు ఓటములను సమానంగా స్వీకరించడం వంటి విలువలు నేర్పుతాయన్నారు. పోటీల విజయవంతానికి హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, రిసోర్సు పర్సన్లు, కార్యక్రమ నిర్వాహకులు కీలకపాత్ర పోషించారని, వారి కృషి ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో ఏఎంఓ విద్యాసాగర్‌, డీఎస్‌ఓ భానుప్రకాష్‌, జాజాపూర్‌ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం భారతి, కార్యక్రమ సమన్వయకర్త కన్కప్ప తదితరులు పాల్గొన్నారు.

క్విజ్‌ : కె.స్పందన, దీక్షిత (పీఎంశ్రీ బాలికల పాఠశాల ఉట్కూర్‌), గౌతమ్‌(పీఎంశ్రీ వడ్వాట్‌)

విజేతలు వీరే..

మాక్‌ పార్లమెంట్‌ : ఆర్‌.ప్రవీణ్‌ (టీజీటీడబ్ల్యూర్‌ఎస్‌, కొండాపూర్‌), సాత్విక

(టీజీఎస్‌డబ్ల్యూర్‌ఎస్‌, మరికల్‌)

స్పెల్‌–బి : కె.రిషిక, మౌనిక (పీఎంశ్రీ బాలికల పాఠశాల ఉట్కూర్‌) ప్రవస్తి, హారిక (పీఎంశ్రీ టీఎస్‌ఎంఎస్‌ గుండుమాల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement