ఉచిత శిక్షణతో ఉద్యోగ సాధనకు బాటలు | - | Sakshi
Sakshi News home page

ఉచిత శిక్షణతో ఉద్యోగ సాధనకు బాటలు

Oct 25 2026 1:11 AM | Updated on Oct 25 2026 1:11 AM

నారాయణపేట: పేదరికం ప్రతిభకు అడ్డు కాకూడదు.. ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేట్‌ శిక్షణ పొందలేని ప్రతిభావంతులకు ఉచిత శిక్షణ ద్వారా అండగా నిలుస్తున్నామని, అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాలని ఎస్పీ వినీత్‌ సూచించారు. శనివారం జిల్లాకేంద్రంలోని లయన్స్‌క్లబ్‌లో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగార్థుల ఉచిత శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అర్హత పరీక్షకు మొత్తం 413 మంది అభ్యర్థులు హాజరుకాగా.. ప్రతిభ ఆధారంగా 130 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు ఉచిత వసతి, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో బోధన, స్టడీ మెటీరియల్‌ అందించడంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించేందుకు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సరైన మార్గదర్శకత్వం, నాణ్యమైన శిక్షణ ఉంటే యువత ఉన్నత లక్ష్యాలను సాధించగలరన్నారు. శిక్షణలో క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరని, నిబంధనలు ఉల్లంఘించే అభ్యర్థులపై చర్యలు తీసుకోవడంతో పాటు శిక్షణ నుంచి తొలగించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. పట్టుదల, నిరంతర సాధనతో లక్ష్యాన్ని చేరుకోవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడంతో పాటు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఎస్పీలు మహేష్‌, నల్లపు లింగయ్య, కాజల్‌, సీఐలు శివశంకర్‌, రాంలాల్‌, భగవంత్‌రెడ్డి, సైదులు, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, సతీష్‌రెడ్డి, నరేష్‌, ఎస్‌బీ ఎస్‌ఐ భాగ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎస్పీ డా. వినీత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement