నారాయణపేట: బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి సమష్టిగా ముందుకు సాగాలని, సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని బ్రాహ్మణ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీస్ రాష్ట్ర నాయకుడు, ఉమ్మడి పాలమూరు జిల్లా మాజీ డీసీఎంఎస్ వైస్ చైర్మన్ వారణాసి రాంప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఉత్తరాది మఠం, పరిమళాపురం రాఘవేంద్ర స్వామి మఠాల్లో నిర్వహించిన బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనాల్లో ఆయన మాట్లాడారు. ఈ నెల 25న జడ్చర్లలోని శ్రీ వాసవి కల్యాణ మండపంలో నిర్వహించనున్న ఉమ్మడి పాలమూరు జిల్లా బ్రాహ్మణ శంఖారావానికి జిల్లా నలుమూలల నుంచి బ్రాహ్మణులు అధికసంఖ్యలో హాజరై ఐక్యతను చాటాలని కోరారు. బ్రాహ్మణ శంఖారావం కరపత్రాలను నారాయణపేట ఉత్తరాది మఠంలో ఉడిపి స్వామీజీ గోవిందతీర్థులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. ధర్మాన్ని అనుసరిస్తూ బ్రాహ్మణులంతా ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో ఉత్తరాది మఠం మేనేజర్ హరీష్ ఆచార్య, బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకుడు కొల్లూర్ భీంసేన్‌రావు, రాఘవేంద్ర స్వామి మఠం అర్చకుడు కొల్పూర్ నర్సింహాచారి, లక్ష్మీశోభన భజన మండలి అధ్యక్షుడు యాద్గిర్ మంగళ విజయాచారి, కార్యదర్శి భళ్లారి విద్య తదితరులు పాల్గొన్నారు.
రైతుల సాగునీటి కల సాకారం
భూత్పూర్: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కాల్వ పనులు పూర్తికావడంతో రైతుల సాగునీటి కల సాకారమైందని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం చేగుంట వద్ద కేఎల్‌ఐ బ్రాంచి కెనాల్ ద్వారా చేగుంట, ఎల్కిచర్ల, మద్దిగట్ల గ్రామాలకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ సాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుత నీటి విడుదలతో చేగుంట, ఎల్కిచర్ల, మద్దిగట్ల చెరువులకు నీరు చేరడంతో పాటు రైతుల పంట పొలాలకు సాగునీరు అందనుందన్నారు. కాల్వ ఏర్పాటుకు సహకరించిన రైతులు, ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి, మహబూబ్‌నగర్ డిప్యూటీ మేయర్ సురేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు కేసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కదిరె శేఖర్‌రెడ్డి, భూపతిరెడ్డి, సర్పంచ్ మాసగౌడ్, తదితరులు పాల్గొన్నారు.


