సామాజిక మాధ్యమాలపై నిఘా : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

సామాజిక మాధ్యమాలపై నిఘా : ఎస్పీ

Oct 23 2026 1:15 AM | Updated on Oct 23 2026 1:15 AM

నారాయణపేట: జిల్లా పరిధిలో సామాజిక మా ధ్యమాలపై పోలీసుల ప్రత్యేక నిఘా కొనసాగుతోందని.. విధ్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, తప్పుడు ప్రచారం, కులమతాల మధ్య విభేదాలు సృష్టించే పోస్టులు చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డా. వినీత్‌ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించా రు. విధ్వేషపూరిత పోస్టులు, ఫొటోలు, వీడియోలను ప్రచారం చేయడం, ఇతరులకు ఫార్వర్డ్‌ చేయడంతో చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. నిజానిజాలను నిర్ధారించుకోకుండా ఇతరులు పంపిన సమాచారాన్ని షేర్‌ చేయవద్దని.. ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని పంచుకునేందుకు, మంచి కార్యక్రమాల ప్రచారానికి వినియోగించుకోవాలని సూచించారు. వ్యక్తిగత దూషణలు, సోషల్‌ మీడియా గ్రూపు ల్లో అభ్యంతరకర, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు వ్యాప్తి చెందకుండా గ్రూప్‌ అడ్మిన్లు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పో స్టులు పెట్టే సమయంలో, ఇతరులకు ఫార్వర్డ్‌ చేసే సందర్భంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరా రు.

పంట అవశేషాలు

కాలిస్తే జరిమానా

నారాయణపేట ఎడ్యుకేషన్‌: పంట అవశేషాల ను కాలిస్తే జరిమానా విధిస్తామని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్‌ హెచ్చరించారు. గురువారం మండలంలోని సింగారం గ్రామ రైతువేదికలో నిర్వహించిన ఖేత్‌ బచావో అభియాన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పంట అవశేషాలను కాల్చడంతో భూసారం, నీటి నిల్వ సామర్థ్యం తగ్గి గాలి కాలుష్యం పెరుగుతుందన్నారు. అలాగే హానికర వాయువులు వాతావరణంలో విడదలవుతాయని వివరించారు.అవశేషాలను నేలలో కలపడంగానీ లేదా పశువులకు మేతగా వినియోగించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలమట్టం తగ్గిపోతోందని.. యాసంగి సీజన్‌లో వరికి బదులు నీరు తక్కువ గా అవసరమయ్యే పంటలు సాగు చేయాల ని కోరారు. కార్యక్రమంలో మండల వ్యవసా య అధికారి దినకర్‌, మండల వ్యవసాయ కమిటీ కార్యదర్శి భారతి, ఏఈఓలు ప్రకాష్‌, రాజేష్‌, అంజమ్మ, అనిల్‌, సుధాకర్‌ పాల్గొన్నారు.

కొనసాగుతున్న సమ్మె

నారాయణపేట ఎడ్యుకేషన్‌: జిల్లాకేంద్రంలోని వివేకానంద పార్క్‌ ఎదుట తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం పదోరోజుకి చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రెండు దశాబ్ధాలుగా వైద్య, ఆరోగ్యశాఖ లో సేవలందిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, క్రమబద్ధీకరణ చేపట్టాలని కోరా రు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు వైద్యసేవలు అందించామని, ప్రభు త్వ ఆరోగ్య కార్యక్రమాల అమలుకు కృషి చేశా మని అయినప్పటికీ తమ సమస్యలు పరిష్కా రంగాకపోవడంతో సమ్మెకు దిగామన్నారు. వైద్యసిబ్బంది ప్రసాద్‌, డా. వెంకటరమణ, మునేష్‌, ఏఎన్‌ఎం సబిత, అజారుద్దీన్‌, విరోజా, డీడీఎం రాఘవేంద్ర పాల్గొన్నారు.

రేపు మండలస్థాయి రోల్‌ప్లే పోటీలు

నారాయణపేట ఎడ్యుకేషన్‌: జిల్లాలోని అర్హత గల పాఠశాలల 9వ తరగతి విద్యార్థులకు శనివారం మండలస్థాయి రోల్‌ప్లే పోటీలు నిర్వహించనున్నట్లు డీఈఓ గోవిందరాజు గురువారం తెలిపారు. మండలస్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులు 28వ తేదీన జిల్లాకేంద్రంలోని మినీ స్టేడియంలో జరిగే జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఒక్కో బృందంలో నలుగురు లేదా ఐదుగురు ఉండవచ్చని ఆరోగ్యం, పర్యావరణం, లింగ సమానత్వంపై ప్రదర్శన ఇవ్వాలన్నారు. అదేవిధంగా ఈ నెల 24న జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులకు జాజాపూర్‌ ఉన్నత పాఠశాలలో క్విజ్‌, స్పెల్‌–బీ, మాక్‌ పార్లమెంట్‌ పోటీలు నిర్వహిస్తామని.. ప్రతి పాఠశాల నుంచి ఆరుగురు వేర్వేరు విద్యార్థులను ఎంపిక చేయాలని కోరారు. క్విజ్‌, స్పెల్‌–బీ పోటీలకు 6 నుంచి 10వ తరగతి, మాక్‌ పార్లమెంట్‌కు 8 నుంచి 10వ తరగతి విద్యార్థులను ఎంపిక చేయాలన్నారు. పీఎంశ్రీ పాఠశాల విద్యార్థులకు 27న జిల్లాస్థాయి కళా సాంస్కృతిక పోటీల్లో డ్రాయింగ్‌, పెయింటింగ్‌, శిల్పకళ, సంగీతం, నృత్యం, వ్యర్థ పదార్థాలతో వస్తువుల తయారీ ఉంటుందన్నారు. ప్రతి పాఠశాల నుంచి 8 మంది విద్యార్థులు, ఒక ఎస్కార్ట్‌ ఉ పాధ్యాయుడు పాల్గొనాలన్నారు. 27, 28 తేదీ ల్లో పీఎంశ్రీ పాఠశాల విద్యార్థులకు జిల్లాకేంద్రంలోని మినీ స్టేడియంలో జిల్లాస్థాయి క్రీ డా పోటీలు నిర్వహించనున్నామని.. 27న ఖో– ఖో, బాలుర వాలీబాల్‌, 28న కబడ్డీ, బాలికల వాలీబాల్‌ పోటీలు ఉంటాయని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement