ప్రజాయోధుడు పండుగ సాయన్న | - | Sakshi
Sakshi News home page

ప్రజాయోధుడు పండుగ సాయన్న

Oct 23 2026 1:15 AM | Updated on Oct 23 2026 1:15 AM

నారాయణపేట: నిరంకుశ పాలన, పెత్తందారులు, భూస్వాములు, జమీందారీ వ్యవస్థల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ ప్రజాయోధుడు పండుగ సాయన్న అని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీను అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి మందిరంలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పండుగ సాయన్న జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదలు, బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలపై జరిగిన అణచివేతను ఎదిరించి పేదల సంక్షేమానికి పోరాడిన ధైర్యశాలి అని కొనియాడారు. ప్రజావీరుడు, తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుగాంచిన ఆయన జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషకరమన్నారు. సమాజంలోని పేదల కష్టాలను గుర్తించి వారి అభ్యున్నతి కోసం ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని పోరాడిన ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. మహనీయుల జీవిత చరిత్రలు నేటితరానికి స్ఫూర్తినిస్తాయని.. వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమాజంలో సమానత్వం, సేవాభావం, పేదల పట్ల మానవత్వాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్టీఏ సభ్యుడు పోషల్‌ రాజేష్‌, కలెక్టరేట్‌ ఏఓ అనిల్‌కుమార్‌, బీసీ సంక్షేమశాఖ అధికారి అబ్దుల్‌ ఖలీల్‌, ముదిరాజ్‌ సంఘం నాయకులు గవినోళ్ల శ్రీనివాస్‌, వకీల్‌ సంతోష్‌కుమార్‌, ఆకుల బాలప్ప, కాకర్ల భీమయ్య, పోషల్‌ వినోద్‌, నర్సింహులు, పాండు, ఎల్‌ఐసీ లక్ష్మణ్‌, మల్లేశ్‌, పోలేమోని గోవింద్‌, గౌని శ్రీను, ముదిరాజ్‌ యువజన సంఘం నాయకులు, కులపెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement