‘రాబోయేది కేసీఆర్‌ పాలనే..’ | - | Sakshi
Sakshi News home page

‘రాబోయేది కేసీఆర్‌ పాలనే..’

Sep 28 2026 12:47 AM | Updated on Sep 28 2026 12:47 AM

కొత్తపల్లి: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వచ్చేది కేసీఆర్‌ పాలనేనని.. అప్పటి వరకు సంయమనం పాటించాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని వాల్యానాయక్‌తండాలో బీఆర్‌ఎస్‌ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని అక్కడే ఏర్పాటుచేసిన సభలో మాట్లాడారు. కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు, 420 హామీలిచ్చి రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేసిందని.. సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందని, రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ పాలనను కోరుకుంటున్నారని వివరించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వంశపారంపర్యంగా వచ్చిన భూములను నిషేధిత జాబితాలో చేర్చి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అలాగే కమీషన్ల కోసం నియోజకవర్గంలో అవసరం లేని చోటకూడా రహదారులు నిర్మిస్తున్నారన్నారు. రాష్ట్రంలో గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత బీఆర్‌ఎస్‌ పార్టీదేనని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన 60 మంది బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, వంచర్ల గోపాల్‌, దౌల్తాబాద్‌ మాజీ జెడ్పీటీసీ మహిపాల్‌, పుర కౌన్సిలర్లు నర్సింహ, మౌలానా, గోపాల్‌, సంగీత, శివకుమార్‌, నాయకులు మహిపాల్‌గౌడ్‌, రాజురెడ్డి, అంజయ్య, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement