పోరాట యోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ | - | Sakshi
Sakshi News home page

పోరాట యోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ

Sep 28 2026 12:47 AM | Updated on Sep 28 2026 12:47 AM

నారాయణపేట: కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఆర్డీఓ రమేష్‌ అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్డీవో బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశం కోసం పోరాడిన బాపూజీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, హక్కుల కోసం కూడా తన గళాన్ని వినిపించారని తెలిపారు. సమానత్వం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. బాపూజీ ఆశయాలను కేవలం జయంతి వేడుకలకే పరిమితం చేయకుండా ప్రజా సంక్షేమం, సామాజిక అభివృద్ధిలో ఆచరణలో పెట్టాలని సూచించారు. బాపూజీ జీవితం ప్రజాసేవ, త్యాగం, పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. నేటి యువత ఆయన జీవితాన్ని, ప్రజా ఉద్యమాల్లో ఆయన పోషించిన పాత్రను తెలుసుకోవాలని సూచించారు. సమాజంలో అసమానతలను తొలగించేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారి అబ్దుల్‌ ఖలీల్‌, డీపీఆర్వో రషీద్‌, వసతి గృహాల వార్డెన్లు, బీసీ సంక్షేమశాఖ ఉద్యోగులు, సిబ్బంది, కలెక్టరేట్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement