తెలంగాణ ఉద్యమంలో చెరగని ముద్ర | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఉద్యమంలో చెరగని ముద్ర

Sep 28 2026 12:47 AM | Updated on Sep 28 2026 12:47 AM

ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ సేవలు చిరస్మరణీయమని ఆర్‌ఐ విజయభాస్కర్‌ అన్నారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర ఉద్యమంతో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో బాపూజీ అలుపెరగని పోరాటం చేశారని గుర్తుచేశారు. తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి స్వశక్తితో ఎదిగిన ఆయన జీవితం నేటితరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ ఎస్‌ఐ శిరీష, ఏఆర్‌ ఎస్‌ఐ నర్సింహతో పాటు ఆర్మ్‌డ్‌ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement