కోస్గి రూరల్: వర్షపు నీటిని ఒడిసిపట్టి నిల్వ చేయడంతో భూగర్భ జలాలు పెంపొందించవచ్చని డీఆర్డీఓ, ఇన్‌చార్జి డీపీఓ వెంకట్రాములు అన్నారు. బుధవారం మండలంలోని చంద్రవంచ రైతువేదికలో వీబీజీ రాంజీ పథకంలో భాగంగా వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికపై గ్రామసభ నిర్వహించగా.. ఆయన హాజరై మాట్లాడారు. మండల అధికారులు వనరుల పటం, సామాజిక పటం రూపొందించి గ్రామ వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరువు నివారణ, నీటి సంరక్షణను గ్రామాభివృద్ధి ప్రణాళిక లక్ష్యాలుగా చేర్చాలన్నారు. పాంపాండ్స్, ఇంకుడు గుంతలు, చెక్‌డ్యాంల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అర్హత ఉన్న కుటుంబాలు పశువుల కొట్టాలు, గొర్రెలు, మేకలు వ్యక్తిగత జీవనోపాధి పనులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వీబీజీరాంజీ టెక్నికల్ ఇన్‌చార్జి వినయ్‌కుమార్, ఎంపీడీఓ శ్రీధర్, ఏపీఓ జయప్రకాశ్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సునిత, సర్పంచ్ విద్యావతి తదితరులు ఉన్నారు.
ముగిసిన చేనేత
నామినేషన్ ప్రక్రియ
ధన్వాడ: చేనేత సహకార సంఘం ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారంతో ముగిసింది. మొత్తం 9 డైరెక్టర్ పదవుల కోసం 21 మంది నామినేషన్లు వేశారు. గురువారం పరిశీలన అనంతరం గుర్తులు కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 29న ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల అధికారి అంజనేయులు వివరించారు.


