ఆదివాసీ కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దాం | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీ కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దాం

Sep 23 2026 12:43 AM | Updated on Sep 23 2026 12:43 AM

నారాయణపేట: ఆదివాసీ కాంగ్రెస్‌ను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడంతో పాటు ఆదివాసీ సమాజంలో కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలని కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. సంఘటనన్‌ సృజన్‌ అభియాన్‌లో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కె.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్‌ వైస్‌ చైర్మన్‌ వి.లింగంనాయక్‌, రాష్ట్ర పరిశీలకుడు శ్రీనునాయక్‌ ముఖ్యఅతిథులుగా హాజరై ఆదివాసీ కాంగ్రెస్‌ కమిటీల ఏర్పాటుకు నాయకులు, కార్యకర్తల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యమని తెలిపారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలను గుర్తించి వారికి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. రాజ్యాంగం, ఆదివాసీ హక్కులు, పీసా, అటవీ హక్కుల చట్టాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించాలని సూచించారు. దీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను గుర్తించి సంస్థాగతంగా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పదవులు పొందిన నాయకులు గ్రామస్థాయిలో ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆదివాసీ మహిళలు, పేదలు, చిన్న వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలోని ఆదివాసీ ప్రజల సమస్యలను గుర్తించి మండల, జిల్లాస్థాయికి తీసుకెళ్లే వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. నాయకులు హోదాలకే పరిమితం కాకుండా ప్రజల మధ్య పనిచేయాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా ఆదివాసీ కాంగ్రెస్‌ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి ఎండీ సలీం, ఆదివాసీ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు అనిల్‌నాయక్‌, జిల్లా ఎస్టీసెల్‌ అధ్యక్షుడు శరణ్‌నాయక్‌, జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ గాజుల శివకుమార్‌, జిల్లా ఓబీసీ సెల్‌ అధ్యక్షుడు గొల్ల కృష్ణయ్య, విజయ్‌నాయక్‌, శ్రీధర్‌ నాయక్‌, సర్పంచులు శ్రీధర్‌ నాయక్‌, సురేష్‌ నాయక్‌, కృష్ణానాయక్‌, తిరుపతి నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement