కృష్ణానదిలో భారీ గణనాథుల నిమజ్జనం | - | Sakshi
Sakshi News home page

కృష్ణానదిలో భారీ గణనాథుల నిమజ్జనం

Sep 23 2026 12:43 AM | Updated on Sep 23 2026 12:43 AM

నారాయణపేట: మండలంలోని కొండారెడ్డిపల్లి చెరువులో నీటిమట్టం తక్కువగా ఉండటంతో 10 అడుగులకు పైబడిన గణపతి విగ్రహాలను కృష్ణానదిలో నిమజ్జనం చేసేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోందని ఎస్పీ డా. వినీత్‌ తె లిపారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉత్సవ కమిటీ సభ్యులు, మండపాల నిర్వాహకులతో సమావేశమై నిమజ్జన ఏర్పాట్లపై చర్చించి మాట్లాడారు. కృష్ణానదిలో నిమజ్జనానికి అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను వివిధ శాఖల సమన్వయంతో చేపడతామని పేర్కొన్నారు. 10 అడుగులకు పైబడిన గణపతి విగ్రహాల నిర్వాహకులు ని మజ్జనానికి అవసరమైన వాహనాలను ముందుగా నే సమకూర్చుకోవాలని సూచించారు. ప్రతి విగ్ర హం వెంట నలుగురు వలంటీర్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. నిమజ్జన కార్యక్ర మం ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ఉత్స వ కమిటీలు, మండపాల నిర్వాహకులు పోలీసుశాఖకు సహకారం అందించాలని కోరారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్‌ ఉల్‌హక్‌, డీఎస్పీలు మహేష్‌, నల్లపు లింగయ్య, సీఐ శివశంకర్‌, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, భాగ్యలక్ష్మిరెడ్డి పాల్గొన్నారు.

ప్రత్యామ్నాయ మార్గాల్లో బస్సులు నడపాలి..

గణేష్‌ శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను ముందుగానే డైవర్ట్‌ చేయాలని ఎస్పీ జి.వినీత్‌ సూచించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నారాయణపేట ఆర్టీసీ డీఎం యాకన్న, కోస్గి డీఎం రాజయ్య మర్యాదపూర్వకంగా ఎస్పీని కలిసి పూల మొక్క అందజేశారు. అనంతరం గణేష్‌ నిమజ్జన ఏర్పాట్ల పై చర్చించారు. నిమజ్జన మార్గాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసుశాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యామ్నాయ మార్గాల్లో బస్సులను నడిపేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. ప్రజల కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, గణేష్‌ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement