వివేకానందుడి ఆశయ సాధనకు కృషి | - | Sakshi
Sakshi News home page

వివేకానందుడి ఆశయ సాధనకు కృషి

Sep 22 2026 12:36 AM | Updated on Sep 22 2026 12:36 AM

మక్తల్‌: వివేకానందుడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపీ డీకే అరుణ, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, నేరెడుగోమ్‌ పీఠాధిపతి సిద్ధలింగేశ్వర మహాస్వామి, బిజ్వార్‌ ఆదిత్యా పరాశ్రీస్వామి అన్నారు. సోమవారం పట్టణంలో ఏర్పాటుచేసిన వివేకానందుడి విగ్రహాన్ని వారు ఆవిష్కరించి మాట్లాడారు. యువతకు వివేకానందుడి జీవితం దిక్సూచి అని.. మక్తల్‌ గడ్డపై ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావంతో ముందుకుసాగాలని సూచించారు. స్వామి వివేకానంద చిన్న వయస్సులోనే తన ప్రసంగాలతో ప్రపంచాన్ని ప్రభావితం చేశారని గుర్తు చేశారు. ఏ రంగంలో ఉన్నా సమాజానికి ఉపయోగపడే సేవ చేయాలని.. అప్పుడే సమాజం గుర్తిస్తుందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, ఏకాగ్రతతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం క్రీడలు, వ్యాసరచన, వకృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిథులు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పుర చైర్‌పర్సన్‌ వాకిటి మానస, రాష్ట్ర నాయకుడు కొండయ్య, సోమశేఖర్‌గౌడ్‌, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ గణేష్‌కుమార్‌, ఏబీవీపీ నగర అధ్యక్షుడు అంజిరెడ్డి, రాష్ట్ర నాయకులు రాంబాబు, కుర్మయ్య, వినయ్‌కుమార్‌, ఇన్‌చార్జ్‌ శరన్‌ సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement