ఆయకట్టుకు సాగునీటిని వదలాలి : బీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

ఆయకట్టుకు సాగునీటిని వదలాలి : బీఆర్‌ఎస్‌

Sep 22 2026 12:36 AM | Updated on Sep 22 2026 12:36 AM

మరికల్‌: పొట్టదశలో ఉన్న వరి పంటలకు వెంటనే కోయిల్‌సాగర్‌ నుంచి నీటిని విడుదల చేయాలంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మరికల్‌ జాతీయ రహదారిపై ఽరాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు లంబడి తిరుపతయ్య, జిల్లా నాయకులు బసంత్‌, కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రూ.లక్షల పెట్టుబడి పెట్టి రైతులు పంటలు సాగు చేశారని.. కీలక దశలో సాగునీరు అందకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు నీటిని విడుదల చేసి రైతులను అదుకోవాలని డిమాండ్‌ చేశారు. కోయిల్‌సాగర్‌ ఆయకట్టుకు సాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యతని.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలో కోయిల్‌సాగర్‌ కింద ఎకరా పంట ఎండిన దాఖాలాలు లేవన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు కింద వేల ఎకరాలు సాగునీరు అందక ఎండిపోతుంటే ఇక్కడి ప్రజాప్రతినిధులకు నీళ్లు వదలాలన్న చిత్తశుద్ధి లేదని.. తక్షణమే ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలని కోరారు. గంటపాటు రాస్తారోకో చేయడంతో కిలోమీటర్‌ మేర వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో నాయకులు రవి, బసంత్‌, రామస్వామి, అశోక్‌, రాజేందర్‌గౌడ్‌, శివకుమార్‌, కృష్ణారెడ్డి, హన్మిరెడ్డి, నారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement