నారాయణపేట ఎడ్యుకేషన్: క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో ఆదివారం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాలికలు, బాలుర జిల్లాస్థాయి కబడ్డీ జట్ల ఎంపికలు నిర్వహించినట్లు తెలిపారు. సుమారు 200 పైగా క్రీడాకారులు పాల్గొన్నారని.. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు వేములవాడలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారన్నారు. రాష్ట్రస్థాయికి వెళ్లే జిల్లా జట్లకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ట్రెజరర్ కతలప్ప క్రీడా దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహులు, వాలీబాల్ కార్యనిర్వాహక కార్యదర్శి సాయినాథ్, లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు రవికుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


