కోస్గి రూరల్: ఉద్యోగ ఉపాధ్యాయులకు త్వర లో ప్రభుత్వం నుంచి మంచి నిర్ణయం లభిస్తుందని ఆశిస్తూన్నామని జిల్లా పీఆర్టీయూ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండల పీఆర్టీయూ సర్వస భ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ 1 చేపట్టిన పీఆర్టీయూ, జేఏసీ ధర్నాల ఫలితంగా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. అనంతరం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. కోస్డి మండల అధ్యక్షుడిగా శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా రాజేందర్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
మెరుగైన సేవలు
అందించాలి
దామరగిద్ద: ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ జయచంద్రమోహన్ సూచించారు. గురువారం దామరగిద్ద పీహెచ్‌సీతో పాటు స్థానిక 4వ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో టీకాలు, మందుల స్టాక్‌తో పాటు పలు రికార్డులను పరిశీలించారు. గర్భిణులు, ఇతర రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అంగన్‌వాడీ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సక్రమంగా పంపిణీ చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి ఐశ్వర్య విజయ్‌కుమార్, అరవింద్, వెంకట్రామారెడ్డి వెంకటేశ్ పాల్గొన్నారు.
ఆధునిక వ్యవసాయ
పద్ధతులతో లాభాలు
కృష్ణా: ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అధిక లాభాలు పొందవచ్చని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త ఈటెల సత్యనారాయణ అన్నారు. గురువారం కృష్ణా మండలం గుర్జాల్ గ్రామంలో నిర్వహించిన పొలంబడి కార్యక్రమంలో ఆయన పాల్గొని పంటల సాగులో పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. రైతులు వరిపంటలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు. పంటకు సోకే తెగుళ్లు, వాటి నివారణ, ఎరువుల వాడకం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ కమలమ్మ, ఏఓ సుదర్శన్‌గౌడ్, ఏఈఓ సునీల్‌కుమార్, నాయకులు కీరప్ప పాటిల్, సంతోష్ పాటిల్ పాల్గొన్నారు.


