ఎర్రవల్లి: మహనీయుల ఆశయాలను ప్రతిఒక్కరూ కొనసాగించాలని పదో పటాలం అసిస్టెంట్ కమాండెంట్ పార్థసారధిరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బీచుపల్లి పదో పటాలంలో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే దేశ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న బ్రిటీష్ పాలన నుంచి దేశ ప్రజలకు విముక్తి కలిగినా.. తెలంగాణ ప్రజలకు విముక్తి కలగలేదన్నారు. కానీ, అప్పటి హోంమంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ చాకచక్యంతో నిజాం నిరంకుశ పాలన నుంచి 1948 సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిందన్నారు. తెలంగాణ భారతదేశంలో విలీనమైన ఈ రోజును తెలంగాణ ప్రభు త్వం ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ వెంకటరమణ, ఆర్‌ఐలు రాజు, శ్రీనివాస్, వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్ పాల్గొన్నారు.
నల్లమలలో పర్యటించిన శిక్షణ ఎస్‌ఎ్‌ఫ్‌ఎస్‌లు
మన్ననూర్: డెహ్రాడూన్‌లోని అటవీ క్షేత్రంలో శిక్షణలో ఉన్న 52 మంది అటవీశాఖ స్టేట్ ఫారెస్టు సర్వీస్ (ఎస్‌ఎఫ్‌ఎస్) శిక్షణలో భాగంగా గురువారం నల్లమలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎఫ్‌డీఓ చంద్ర ప్రకాష్ సింఘాల్ సమక్షంలో అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యం, ఫర్హాబాద్, రేలింగ్ సెంటర్, చెక్‌పోస్టు, వనమాళికతోపాటు అటవీ లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం ఈసీ సెంటర్‌లో ఎఫ్‌డీఓ ఇక్కడి పరిస్థితులు, అడవులు, వన్యప్రాణుల మనుడ తదితర అంశాల గురించి వారికి వివరించారు. కార్యక్రమంలో ట్రైనర్ అరుణ్‌కుమార్, ఎఫ్‌ఆర్‌ఓ సవిత, వీరేష్, ఎఫ్‌ఎస్‌ఓ సురేందర్, బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.


