విద్యుత్‌ కోతలపై రైతుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ కోతలపై రైతుల ధర్నా

Sep 18 2026 2:15 AM | Updated on Sep 18 2026 2:15 AM

నర్వ: వ్యవసాయానికి విద్యుత్‌ కోతలను నిరసిస్తూ గురువారం రైతులు రోడ్డెక్కారు. నర్వ మండలం కల్వాల్‌లో ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రైతుల ధర్నాకు బీఆర్‌ఎస్‌ నాయకులు మద్దతుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రస్తుతం వ్యవసాయానికి ఇస్తున్న 12 గంటల కరెంటు సరిగ్గా సరఫరా చేయకపోవడంతో పంటలకు నీరందక ఎండిపోతుండటంతో పాటు విద్యుత్‌ మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గంట సమయంలోనే పదుల సంఖ్యలో కరెంటు వచ్చి పోతుండటంతో మోటార్లు ఎత్తుకోలేకపోతున్నాయని తెలిపారు. విద్యుత్‌ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. కరెంటు కోతలను అరికట్టి.. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ అందించాలని డిమాండ్‌ చేశారు. కాగా, రైతుల ఆందోళనతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికుల అభ్యర్థన మేరకు రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు ఆంజనేయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement