420 హామీలతో మోసం చేసిన కాంగ్రెస్‌ | - | Sakshi
Sakshi News home page

420 హామీలతో మోసం చేసిన కాంగ్రెస్‌

Sep 18 2026 2:15 AM | Updated on Sep 18 2026 2:15 AM

నారాయణపేట: ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. 30 నెలల కాలంలో వాటి అమలుపై సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎన్‌వీ సుభాష్‌ డిమాండ్‌ చేశారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీని విమర్శించడానికే ఎక్కువ సమయం కేటాయించిందని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు, రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. సంపద సృష్టిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఆ దిశగా సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి నిధులు కేటాయిస్తోందని, బీజేపీ అధికారంలో లేకపోయినా ఎంపీ డీకే అరుణ నేతృత్వంలో కేంద్రంతో సమన్వయం చేసుకుని నిధులు తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో జాతీయ రహదారులతో సహా పలు అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి భారీగా నిధులు వస్తున్నాయని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వానికి ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలిచి భారత్‌ను విశ్వగురుగా తీర్చిదిద్దేందుకు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరినీ కేంద్ర పథకాలలో భాగస్వాములను చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు నాగూరావు నామాజీ, కె. రతంగ్‌ పాండురెడ్డి, కొండయ్య, జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కొండా శ్వేత, రఘురామయ్యగౌడ్‌, లక్ష్మి, వెంకట్‌రెడ్డి, తిరుపతి, బంటు రమేశ్‌, కృష్ణ, మహబూబ్‌అలీ, సాయిబాన్న, కిరణ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement