పండుగ వేళ మద్యం దందాకు అడ్డుకట్ట | - | Sakshi
Sakshi News home page

పండుగ వేళ మద్యం దందాకు అడ్డుకట్ట

Sep 18 2026 2:15 AM | Updated on Sep 18 2026 2:15 AM

నారాయణపేట: గణేశ్‌ ఉత్సవాల నేపథ్యంలో మద్యం అక్రమ విక్రయాలు, సరఫరాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్‌, ఎకై ్సజ్‌ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ డా.వినీత్‌ సూచించారు. జిల్లాలో నూతనంగా నియమితులైన ఎకై ్సజ్‌ సీఐ నందిగామ సైదులు, ఎస్‌ఐలు సతీష్‌, శంకర్‌ గురువారం ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పండుగ వేళ మద్యం అక్రమ రవాణా, అనధికార విక్రయాలు జరిగే అవకాశాలపై ముందస్తు నిఘా పెట్టి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఉత్సవాల సమయంలో అనుమతి లేని ప్రదేశాల్లో మద్యం విక్రయాలు, నిల్వలు, సరఫరా జరగకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం సేకరించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టాలన్నారు. గణేశ్‌ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు, యువత రహదారులపైకి వస్తారని.. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. పోలీస్‌, ఎకై ్సజ్‌ శాఖల మధ్య నిరంతర సమాచార మార్పిడి, సమన్వయం ఉంటే మద్యం అక్రమ దందాను నియంత్రించడంతో పాటు గణేశ్‌ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement