మహిళా సంక్షేమానికి పెద్దపీట.. | - | Sakshi
Sakshi News home page

మహిళా సంక్షేమానికి పెద్దపీట..

Sep 18 2026 2:15 AM | Updated on Sep 18 2026 2:15 AM

మహిళా సంక్షేమానికి పెద్దపీట..

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసి పథకాలు అమలు చేస్తోందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యంతో పాటు వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. జిల్లాలో 70,120 మంది లబ్ధిదారులకు 1,83,969 సిలిండర్లను సబ్సిడీపై అందించగా.. రూ.4.66 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. అలాగే గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 1,29,009 గృహ విద్యుత్‌ సర్వీ సులు ఉండగా.. 83,032 మంది వినియోగదా రులు ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. సెప్టెంబర్‌ 2026 వరకు రూ.13.95 కోట్ల సబ్సిడీ ప్రయోజనం అందినట్లు వివరించారు.

● రాష్ట్రంలోనే మొట్టమొదటగా జిల్లాస్థాయి సమగ్ర కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. 35 వేల లీటర్ల సామర్థ్యం గల ప్లాంట్‌తో పాటు డిజిటల్‌ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టామని.. 11 మంది మహిళలు విడతల వారీగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు ప్లాంట్‌, డిజిటల్‌ ఉత్పత్తుల విక్రయం ద్వారా రూ.30.30 లక్షల లాభం వచ్చినట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement