పోరాటయోధుడు రాఘవేందర్‌రావు.. | - | Sakshi
Sakshi News home page

పోరాటయోధుడు రాఘవేందర్‌రావు..

Sep 17 2026 2:08 AM | Updated on Sep 17 2026 2:08 AM

పోరాటయోధుడు రాఘవేందర్‌రావు..

మక్తల్‌: నాటి మక్తల్‌ నియోజకవర్గ పరిధిలోని నారాయణపేటకు చెందిన న్యాయవాది, స్వాతంత్య్ర సమరయోధుడు రాఘవేందర్‌రావు నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. అప్పట్లో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన సుమారు 300 మంది స్వాత్రంత్య్ర సమరయోధులకు నాయకత్వం వహించారు. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని విలీనం చేసేందుకు రజాకార్లు ఒప్పుకోకపోవడంతో వారికి వ్యతిరేకంగా రాఘవేందర్‌రావు ధైర్యంగా ముందుకొచ్చి తన అనుచరులతో పోలీస్‌స్టేషన్లపై దాడులు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఆయుధాలను ఎత్తుకెళ్లడంలో దిట్టగా పని చేశారు. ప్రతి గ్రామంలో సమావేశాలు నిర్వహించి భూమి పన్ను కట్టరాదని సూచించారు. అప్పట్లో కొందరు నిజాం పాలకులు ఆయనను చంపేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఆయనను పట్టుకుంటే 5 వేల ఉస్మానియా చిక్కలను నజరానాగా ఇస్తామని నిజాం పాలకులు ప్రకటించారు. రాఘవేందర్‌రావు సోదరుడు శ్రీనివాసరావు తన ఇంట్లో రజాకార్లకు దొరకడంతో అరెస్టు చేసి జైలులో బంధించారు. న్యాయవాద వృత్తిని, కుటుంబసభ్యులను వదిలి ప్రాణాలను లెక్కచేయకుండా రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. గ్రామాల్లో రజకార్లకు వ్యతిరేకంగా సమావేశాలు చేసేవారు. జిల్లా అభివృద్ధి కోసం సభలు, సమావేశాలు నిర్వహించేవారు. 02.02.1986లో నారాయణపేటలోనే ఉమ్మడి జిల్లా 4వ సదస్సును ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు పేటకు చెందిన శాంతాబాయి, మోచ్చె బసప్ప, గందె బన్నప్ప, చిట్టెం నర్సిరెడ్డి, నర్సింహులునాయిడు ఆయన నాయకత్వంలో పని చేశారు. వారు రాఘవేందర్‌రావు హయాంలోను ఎమ్మెల్యేలుగా గెలిచారు.

న్యాయవాద వృత్తిలోనే కుటుంబం..

రాఘవేందర్‌రావు కుమారుడు కిషన్‌రావు న్యాయవాది వృత్తి చేపట్టారు. ప్రస్తుతం ఆయన మనవడు వెంకట్‌రావు న్యాయవాదిగా హైదరాబాద్‌లో పని చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement