ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలి

Sep 17 2026 2:08 AM | Updated on Sep 17 2026 2:08 AM

నారాయణపేట: వినాయక చవితి ఉత్సవాలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలు, ఆనందోత్సాహాలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అదనపు ఎస్పీ ఎండీ రియాజ్‌ ఉల్‌హక్‌, డీఎస్పీలు మహేష్‌, నల్లపు లింగయ్య కోరారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహానికి బుధవారం వారు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ), భజరంగ్‌దళ్‌ నాయకులను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు, పోలీసులు సుఖశాంతులతో ఉండాలని, అందరికీ మంచి జరగాలని వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్టమైన పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో సోషల్‌ మీడియాపై పోలీస్‌శాఖ పూర్తిస్థాయి లో నిఘా ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇతర మతాల మనోభావాలను కించపర్చేలా, రెచ్చగొట్టే విధంగా పోస్టులు, వీడియోలు, సందేశాలను ప్ర చారం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా సమస్యలు, అనుమానాస్పద వ్యక్తులు, ఘటనలు గుర్తించిన వెంటనే పోలీసులకు లేదా డయల్‌ 112కు సమాచారం అందించాలని సూచించారు. అలాగే 24 గంటలు అందుబాటులో ఉండే పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 87126 70399కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో సీఐ శివశంకర్‌, ఆర్‌ఐ విజయభాస్కర్‌, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీస్‌ సిబ్బంది, ఎస్‌బీ, డీసీఆర్బీ, డీపీఓ సిబ్బంది, హోంగార్డులు, పోలీస్‌ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement