భూ సేకరణ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

భూ సేకరణ వేగవంతం చేయాలి

Sep 11 2026 10:57 AM | Updated on Sep 11 2026 10:57 AM

నారాయణపేట: జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి కొనసాగుతున్న భూ సేకరణ ప్రక్రియను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌ వీసీ హాల్‌లో త హసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీ క్ష నిర్వహించి మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు భూముల ఎంజాయ్‌మెంట్‌ వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించాలన్నారు. మద్దూరు, గుండుమల్‌ మండలాల్లో కొత్తగా చేపట్టాల్సిన సర్వే పనులను వెంటనే ప్రారంభించి ఎలాంటి తప్పులకు తావులేకుండా పూర్తి చేయాలని ఆ దేశించారు. ఎంజాయ్‌మెంట్‌ సర్వేను క్షేత్రస్థాయి లో పక్కాగా నిర్వహించి సంబంధిత రికార్డులను పరిశీలించి నివేదికలను సకాలంలో సమర్పించాలని ఆదేశించారు. భూ సేకరణ పురోగతిపై మరో సారి సమీక్ష నిర్వహిస్తామని, అధికారులు చేపట్టిన పనులకు సంబంధించిన స్పష్టమైన వివరాలను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. క్లిష్టమైన, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించి భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీను, ఆర్డీఓ రమేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement