గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం

Sep 10 2026 1:27 AM | Updated on Sep 10 2026 1:27 AM

కోస్గి రూరల్‌: గ్రామీణ ప్రాంతాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తిరుపతిరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలో సీఎస్‌ఆర్‌ నిధులు రూ.30 లక్షలతో కంప్యూటర్‌ ల్యాబ్‌లు, చంద్రవంచలో రూ.30 లక్షలతో కమిట్‌మెంట్స్‌ భవన నిర్మాణానికి భూమి పూజ, ముంగిమళ్లలో రూ.30 లక్షల ఎండోమెంట్‌ నిధులతో ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేయడంతో పాటు ముంగిమళ్ల – లోదీపూర్‌ దారిలో రూ.3 కోట్ల కడా నిధులతో నిర్మించిన హైలెవల్‌ వంతెనను ప్రారంభించారు. అదేవిధంగా ముశ్రీఫా శివారులో రూ.2.11 కోట్ల కడా నిధులతో సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, గ్రామాల్లోని నాయకులు సమష్టిగా సహకరించాలని కోరారు. గ్రామాల్లోని సమస్యలను సైతం తమ దృష్టికి తీసుకురావాలని.. పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తోందని.. ఆరు గ్యారెంటీలు అమలు చేసి ప్రజాదరణ పొందిందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ వార్ల విజయ్‌కుమార్‌, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి, పుర చైర్మన్‌ నాగులపల్లి నరేందర్‌, సర్సంచ్‌ల సంఘం అధ్యక్షుడు సుధాకర్‌గౌడ్‌, మున్సిపల్‌ అధ్యక్షుడు బెజ్జు రాములు, కౌన్సిలర్లు శ్రీనివాస్‌, తుడుం శ్రీనివాస్‌, రాజేష్‌, ముశ్రీపా సర్పంచ్‌ వెంకటమ్మ, విద్యాసాగర్‌, మహిపాల్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, బాలే ష్‌, ఫిరోజ్‌, హాజీ, సలీం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement