కొల్లాపూర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేశామని రాష్ట్ర పంచాయతీరాజ్, సీ్త్ర, శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడాన్ని బీఆర్‌ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఉచిత బస్సుల్లో ప్రయాణిస్తే మహిళలు చెడిపోతున్నారంటూ ఆ పార్టీ నేత లు మాట్లాడుతున్నారని, మహిళలను ఇప్పటికీ వంటింటికే పరిమితం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన సభలో సీతక్క మాట్లాడారు. మహిళలు, పేదలను కించపరిచేలా మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ను ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణతో పాటు తెలంగాణ సంస్కృతిని కాపాడేందుకు త్వరలో ‘ప్రభాతభేరి’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపా రు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పారు. ఎంపీ మల్లు రవి మా ట్లాడుతూ.. కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా చర్యలు తీసుకుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పాలనంతా
దగా : బీఆర్‌ఎస్
నర్వ: కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు, 6 గ్యారెంటీలతో వెయ్యి రోజుల పాలనంతా దగా తప్పా.. చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి పట్టణ వీధులు మీదుగా అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పాలనలో లోఓల్టేజీ సమస్య ఉండేది కాదని, అన్ని గ్రామాల రైతులకు సేవలందించేందుకు రైతువేధికలు, కొత్త పంచాయతీలు, వైకుంఠధామాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అందించే రైతుబీమా, పేద ఆడబిడ్డల కోసం తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రద్దు చేసేందుకు చూస్తోందన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పేరిట శంకుస్థాపనలు తప్ప పనులు ప్రారంభించడం లేదని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ లక్ష్మన్న, నాయకులు దండు అయ్యప్ప, శంకర్, లక్ష్మీనర్సింహ, అరవింద్‌రెడ్డి, శివన్న, రాజారెడ్డి, పాల్గొన్నారు.
12న జాతీయ
లోక్ అదాలత్ : ఎస్పీ
నారాయణపేట: జిల్లాలోని నారాయణపేట, కోస్గి, మక్తల్ కోర్టుల్లో ఈ నెల 12న శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఎస్పీ డా. వినీత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్టుల్లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రాజీ పడదగిన కేసులను కక్షిదారులు పరస్పర అంగీకారంతో త్వరగా పరిష్కరించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాజీయే రాజమార్గమనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని.. కేసులను పరిష్కరించుకోవాలనుకునే వారు సంబంధిత పోలీస్ అధికారులు లేదా కోర్టు విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. జిల్లాలోని పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది రాజీ పడదగిన కేసులను గుర్తించి ఇరువర్గాలను సంప్రదిస్తారని, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు.
188.817 మి.యూ. విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల జలాశయం దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. శనివారం ఎగువన ఒక యూనిట్ నుంచి 39 మెగావాట్లు, 101.283 మి.యూ., దిగువన ఒక యూనిట్ నుంచి 40 మెగావాట్లు, 87.534 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఇప్పటి వరకు ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాల్లో 188.817 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు.


