ముకుందా..
● నారాయణపేట, మక్తల్‌లో
ఘనంగా ఉట్ల సంబరాలు
● భారీగా తరలివచ్చిన భక్తులు
ఉట్టి కొడుతున్న యువత..
కార్యక్రమానికి
హాజరైన భక్తులు
నారాయణపేట/మక్తల్: జిల్లాకేంద్రంలోని చౌక్‌బజార్, మక్తల్ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శనివారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. జిల్లాకేంద్రంలో మిత్రమండలి ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించగా.. దూల్‌పేట యువజన సంఘం ఆధ్వర్యంలో 30 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన ఉట్టిని యువకులు పిరమిడ్‌గా ఏర్పడి పగులగొట్టారు. కార్యక్రమంలో చిన్నారుల శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 50 ఏళ్లుగా చౌక్‌బజార్ మిత్రమండలి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పుర చైర్‌పర్సన్ కొండ శ్వేత, వైస్ చైర్‌పర్సన్ మంజుల, డీఎస్పీ లింగయ్య, సీఐ శివశంకర్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, చౌక్‌బజార్ మిత్రమండ లి కన్వీనర్ హరినారాయణ్ భట్టడ్, కౌన్సిలర్ రా జేష్ ఘట్, బిల్డర్ వెంకట్రాములు పాల్గొన్నారు.
● మక్తల్‌లో శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాయంత్రం పాలఉట్ల కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలిత స్వామివారి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి వాకిటి శ్రీహరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో యువకులు పాల ఉట్ల స్తంభం పోటాపోటీగా ఎక్కి ఉట్టి కొట్టారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా మక్తల్ సీఐ రాంలాల్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్ వాకిటి మానస, మాజీ ఎంపీపీ కొండయ్య, శ్రీనివాస్‌గుప్తా, కౌన్సిల ర్ పీకే నర్సింహ, కట్ట సురేష్, ఆలయ కమిటీ సభ్యులు డా. శ్రీరామ్ పాల్గొన్నారు.


