ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైంది | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైంది

Sep 6 2026 1:43 AM | Updated on Sep 6 2026 1:43 AM

నారాయణపేట ఎడ్యుకేషన్‌: అన్ని వృత్తుల్లోకెల్లా ఉపాధ్యాయ వృత్తి అత్యున్నతమైందని డీఆర్వో రాజేశ్వరి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి అధికారులు, ఉపాధ్యాయులు చేస్తున్న సమష్టి కృషిని అభినందించారు. మూడేళ్లుగా విద్యార్థుల అభ్యసన ఫలితాల్లో ఘనమైన పురోగతి సాధించిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెంచడంతో పాటు మౌలిక వసతులు మెరుగుపర్చి ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా కృషి చేయాలని సూచించారు. మంచి ఉపాధ్యాయుడు ఓ విద్యార్ధి జీవితాన్నే కాదు కుటుంబాన్ని, సమాజాన్ని, దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దగలడన్నారు. అదేవిధంగా జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 68 మందిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం జిల్లా విద్యాధికారి డా. గోవిందరాజు మాట్లాడుతూ.. పురస్కారాలు బాధ్యతను మరింత పెంచుతాయని రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా తనతో పాటు ఎంపికై న ఇద్దరికి, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు విద్యారంగంలో ఎనలేని కృషి చేసి భవిష్యత్‌లో మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. విద్యారంగంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు. అనంతరం జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేయడంతో పాటు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను పూలమాలలతో సత్కరించారు. ఉపాధ్యాయుల కృషిని సత్కరించడంతో వారి సేవలకు సముచిత గౌరవం లభించడంతో పాటు భవిష్యత్‌లో మరింత అంకితభావంతో పని చేయడానికి ప్రోత్సాహం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, పుర చైర్‌పర్సన్‌ కొండా శ్వేత సత్యయాదవ్‌, కోస్గి పుర చైర్మన్‌ నరేందర్‌, ఏఎంమ్‌సీ చైర్మన్‌ సదాశివారెడ్డి, ఏఎంఓ విద్యాసాగర్‌, డీఎస్‌ఓ భానుప్రకాష్‌, ఎస్‌ఓ రాజేంద్రకుమార్‌, యాదయ్యశెట్టి, సాయినాథ్‌, నాగార్జునరెడ్డి, అన్ని మండలాల ఎంఈఓలు, విద్యాశాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement