ఆధునిక హంగులతో పాఠశాల నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

ఆధునిక హంగులతో పాఠశాల నిర్మాణం

Sep 6 2026 1:43 AM | Updated on Sep 6 2026 1:43 AM

● కొడంగల్‌లో శిలా ఫలకాన్ని

ప్రారంభించిన ముఖ్యమంత్రి

కోస్గి రూరల్‌: విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలు, ఆధునిక హంగులతో పాఠశాల భవన నిర్మాణం చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం కొడంగల్‌లో అరబిందో ఫార్మా ఫౌండేషన్‌, అరబిందో ఫార్మా లిమిటెడ్‌ దాతృత్వ విభాగం సహకారంతో రూ.4 కోట్ల సీఎస్‌ఆర్‌ నిధులతో నిర్మించనున్న కోస్గి ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవన నిర్మాణ శిలా ఫలాకాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖమంత్రి దామోదర రాజనర్సింహ, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌తో కలిసి ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అలాగే గణపతి, సరస్వతి, వేంకటేశ్వరస్వామి చిత్రపటాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య, నైపుణ్యాల పెంపునకు కృషి చేస్తోందన్నారు. విద్యారంగం అభివృద్ధికి సహకరిస్తున్న అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ నిర్వాహకులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, కడా చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, అరబిందో ఫౌండేషన్‌ సీఎస్‌ఆర్‌ సదానందరెడ్డి, సీనియర్‌ వైస్‌ పెస్రిడెంట్‌ డా. ఐఎస్‌ఆర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement