హెచ్‌సీఏ టోర్నీలకు పాలమూరు క్రికెటర్లు | - | Sakshi
Sakshi News home page

హెచ్‌సీఏ టోర్నీలకు పాలమూరు క్రికెటర్లు

Sep 5 2026 6:25 AM | Updated on Sep 5 2026 6:25 AM

● అండర్‌–23 ఎమర్జింగ్‌ టోర్నీకి అబ్దుల్‌ రాఫే

● సీనియర్‌ సూపర్‌లీగ్‌లో గణేష్‌.. అభినందించిన ఎండీసీఏ

మహబూబ్‌నగర్‌ క్రీడలు: హెచ్‌సీఏ టోర్నీలకు జిల్లాకు చెందిన ఇద్దరు క్రికెటర్లు ఎంపికయ్యారు. అండర్‌–23 మెన్స్‌ ఎమర్జింగ్‌ ప్లేయర్స్‌ 4–డే టోర్నమెంట్‌ 2026–27కు అబ్దుల్‌ రాఫే బిన్‌ అబ్దుల్లా ఎంపికయ్యాడు. ఈ టోర్నమెంట్‌ నేటి (శనివారం) నుంచి ప్రారంభంకానుంది. టోర్నమెంట్‌లో వికెట్‌ కీపర్‌ అబ్దుల్‌ రాఫే టీమ్‌–బీకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అబ్దుల్‌ రాఫే కీపర్‌గా బ్యాట్స్‌మెన్‌గా విశేష ప్రతిభ కనబరుస్తున్నాడు. ఇటీవల జరిగిన రెండురోజుల లీగ్‌లో కంబైన్డ్‌ డిస్టిక్‌–1 తరఫున ఆడాడు. అబ్దుల్‌ రాఫే గత ఏడాది సీజన్‌ టు డేగ్‌ లీగ్‌లో మూడు సెంచరీలు, ఒక అర్ధసెంచరీలు చేశాడు. అదేవిధంగా గతేడాది జరిగిన కాకా వెంకటస్వామి మెమోరియల్‌ టీ–20 టోర్నీలో 9 మ్యాచుల్లో ఐదు అర్ధసెంచరీలతో 350 పరుగులు చేశాడు. ఈ ఏడాది సీజన్‌ టుడేలీగ్‌లో ఏ–డివిజన్‌లో రెండు అర్ధసెంచరీలు చేశాడు. అండర్‌–23 ఎమర్జింగ్‌ టోర్నీలో మెరుగైన ప్రతిభ కనబరిచి హెచ్‌సీఏ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతానని ధీమా వ్యక్తం చేశాడు అబ్దుల్‌ రాఫే.

అండర్‌–23 ఎమర్జింగ్‌ టోర్నీకి ఎంపికై న అబ్దుల్‌ రాఫే

అభినందించిన ఎండీసీఏ

హెచ్‌సీఏ టోర్నీలకు ఎంపికై న అబ్దుల్‌ రాఫే, గణేష్‌ గడుగులను ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం. రాజశేఖర్‌ అభినందించారు. ఇద్దరూ టోర్నీల్లో ప్రతిభ కనబరిచి హెచ్‌సీఏ రాష్ట్రస్థాయి జట్లతో పాటు రంజీ జట్టుకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. జిల్లా నుంచి ప్రతిభావంతులైన క్రికెటర్లు రాష్ట్రస్థాయిలో రాణించడం అభినందనీయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement