నారాయణపేట: సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అ న్ని కోణాల్లో భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ డా. వినీత్ తెలిపారు. గురువారం మద్దూర్‌లోని ఓ ఫంక్షనన్‌హాల్‌లో బందోబస్తు విధులకు వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఆయన దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం 500 మంది పోలీసులను బందోబస్తు విధుల్లో నియమించినట్లు తెలిపారు. 9 సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టార్‌కు అదనపు ఎస్పీ, డీఎస్పీ, సీఐ స్థాయి అధికారులను ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తారని.. సమన్వయంతో పనిచేస్తూ ప్రతి అంశాన్ని నిశితంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని.. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూ చించారు. భద్రతా లోపాలకు ఆస్కారం లేకుండా రూట్ మానిటరింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ట్రాఫిక్ నియంత్రణను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. హెలిప్యాడ్ నుంచి కాన్వాయ్ వెళ్లే మార్గంలో రోడ్ ఓపెనింగ్ పార్టీలు, పెట్రోలింగ్ బృందాలు, ట్రాఫిక్ డైవర్షనన్ సిబ్బంది, రూఫ్‌టాప్ సెంట్రీలు ఏర్పాటు చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దించారు. పార్కింగ్ నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని కేటాయించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్‌హక్, డీఎస్పీలు మహే ష్, లింగయ్య, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


