● ఐదు రోజుల్లో రూ.16.04 కోట్ల రాబడి
● 28.36 లక్షల మంది ప్రయాణం.. 490 ప్రత్యేక బస్సులు
● ఒక్క 31వ తేదీనే రూ.3.65 కోట్ల ఆదాయం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఈసారి రాఖీ పండుగతో ఆర్టీసీ మహబూబ్‌నగర్ రీజియన్‌కు రికార్డుస్థాయిలో ఆదాయం వచ్చింది. వరుసగా సెలవులు రావడంతో ప్రయాణికుల సౌకర్యార్థం గత నెల 27 నుంచి 31వ తేదీ వరకు 490 ప్రత్యేక బస్సులను నడిపారు. పండుగ వేళ వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రీజియన్ పరిధిలోని పది డిపోల అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆయా డిపోల నుంచి హైదరాబాద్ రూట్లో ఎక్కువ బస్సులను నడిపించారు. ఈ రూట్లోనే మహబూబ్‌నగర్ రీజియన్‌కు అధిక ఆదాయం వచ్చింది.
5 రోజుల ఆదాయం వివరాలు..
ఆగస్టు 27న మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలో 5,21,227 మంది ప్రయాణికుల ద్వారా రూ.2,63,11,000 రాగా.. 28న 5,88,639 మంది ప్రయాణికుల ద్వారా రూ.3,43,32,000, 29న 5,97,940 మంది ప్రయాణికుల ద్వారా రూ.3,20, 47,000 ఆదాయం వచ్చింది. అలాగే ఆగస్టు 30న 5,47,837 మంది ప్రయాణికుల ద్వారా రూ.3,12, 03,000, ఆగస్టు 31న అత్యధికంగా 5,80,705 మంది ప్రయాణికుల ద్వారా రూ.3,65,37,000 సమకూరింది. ఐదు రోజులకు కలిపి మహబూబ్‌నగర్ రీజియన్‌కు మొత్తం రూ.16,04,31,000 వచ్చింది. డిపోల పరంగా చూస్తే మహబూబ్‌నగర్ అత్యధికంగా రూ.2,55,99,000, రెండో స్థానంలో వనపర్తి రూ.2,14,09,000 ఆదాయం పొందాయి.
డిపో ప్రయాణికులు వచ్చిన
ఆదాయం
మహబూబ్‌నగర్ 3,86,772 255.99
వనపర్తి 3,85,245 214.09
కల్వకుర్తి 3,20,874 184.43
గద్వాల 3,45,811 166.72
నారాయణపేట 2,82,531 164.30
షాద్‌నగర్ 3,03,239 159.55
అచ్చంపేట 2,27,437 159.18
నాగర్‌కర్నూల్ 3,01,235 145.68
కొల్లాపూర్ 1,97,055 112.47
కోస్గి 86,149 41.89


