నారాయణపేట ఎడ్యుకేషన్: జవహర్ నవోద య విద్యాలయాల్లో 2027–28 విద్యాసంవత్సరానికిగాను 9, 11వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి లేటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్–2027 నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి డా. గోవిందరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని.. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఎలాంటి రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎంపికై న విద్యార్ధులు నాగర్‌కర్నూల్ జిల్లా వట్టెం గ్రామంలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయలో ప్రవేశాలు పొందవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు అధికారిక రిజిస్ట్రేషన్ పోర్టల్ https://cbseitms. nic/2026/ nvsix 9, htt ps://cbseitms.nic.i n/2026/ nvsxi 11ను సంప్రదించాలన్నారు. దరఖాస్తు సమర్పణకు ఈ నెల 30 వరకు గడువు ఉందని తెలిపారు.
క్రీడలతో ఉజ్వల భవిష్యత్
నారాయణపేట ఎడ్యుకేషన్: క్రీడల్లో రాణిస్తే ఉ జ్వల భవిష్యత్ ఉంటుందని డీఐఈఓ సుదర్శన్ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని మినీ స్టేడియంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్, పీఈటీల ఆధ్వర్యంలో పాఠశాలస్థాయి క్రికెట్ పోటీలు జరిగాయి. మంగళవారం వైదిక ఎయిడెడ్ ఉన్నత పాఠశాల, మాడ్రన్ హైస్కూల్ మధ్య చివరి మ్యాచ్ జరగగా.. మాడ్రన్ హైస్కూల్ విజేతగా, వైదిక ఉన్నత పాఠశాల రన్నరప్‌గా నిలిచింది. ఇరు జట్లకు డీఐఈఓ బహుమతులు అందజేసి మాట్లాడారు. జాతీయ జట్టులో ఆడి జిల్లా, ఊరు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రికెట్ ఇన్‌చార్జ్ రమణ, కోచ్ అజయ్ పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ
జీవితబీమా తీసుకోవాలి
నారాయణపేట: భారత బీమా రంగంలో ఎల్ ఐసీకి 70 ఏళ్ల చరిత్ర ఉందని నారాయణపేట బ్రాంచ్ మేనేజర్ కృష్ణారెడ్డి అన్నారు. ఎల్‌ఐసీ స్థాపించి 70 వసంతాలు పూర్తయిన సందర్భంగా మంగళవారం బ్రాంచ్ కార్యాలయంలో వే డుకలు ఘనంగా నిర్వహించారు. మేనేజర్ జ్యో తి వెలిగించి కార్యక్రమాలు ప్రారంభించి మా ట్లాడారు. భారత బీమా రంగం అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తుకొచ్చే పేరు ఎల్‌ఐసీ అన్నారు. కోట్లాది మంది భారతీయుల జీవితాలకు ఆర్థిక భద్రత కల్పిస్తూ దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థగా విశిష్ట సేవలు అందిస్తోందని తెలిపారు. బీమా సేవలకే పరిమితం కాకుండా దేశ ఆర్థికాభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషిస్తోందని గుర్తు చేశారు. అనుకోని పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడంలో జీవిత బీమా ఎంతో కీలకమని.. ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్ భద్రత కోసం తప్పనిసరిగా జీవిత బీమా తీసుకోవాలని కోరారు.


